'రాజా సాబ్'తో తమన్నా స్టెప్పులు!

రాజా సాబ్తో తమన్నా స్టెప్పులు!
X
రెబల్ స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ డ్రామా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

రెబల్ స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ డ్రామా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ తమన్నాను ఫైనల్ చేసినట్లు టాక్.

గతంలో ‘రెబల్, బాహుబలి 1 & 2’ చిత్రాల్లో ప్రభాస్‌తో జత కట్టిన తమన్నా, ఈసారి ఐటెం సాంగ్ రూపంలో సందడి చేయబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్పెషల్ సాంగ్స్ చేయడంలో తమన్నాది ప్రత్యేకమైన శైలి. 'జై లవ కుశ, సరిలేరు నీకెవ్వరు, కె.జి.యఫ్, జైలర్, స్త్రీ 2' వంటి చిత్రాల్లో తమన్నా చేసిన స్పెషల్ నంబర్స్ సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి.

ఇప్పటికే 'ది రాజా సాబ్'లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు తమన్నా కూడా ఈ మూవీకి స్పెషల్ గ్లామర్ తీసుకురాబోతుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags

Next Story