పెళ్లి వార్తలపై స్పందించిన స్వీటీ!

అందాల తార అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఘాటి‘. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వస్తోంది. ఈనేపథ్యంలో చిత్రబృందం వరుసగా ప్రమోషనల్ యాక్టివిటీస్ నిర్వహిస్తూ ఉంది. కానీ.. అనుష్క మాత్రం ప్రచార కార్యక్రమాలలో కనిపించడం లేదు. అయితే.. లేటెస్ట్ గా టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానాతో అనుష్క ఫోన్ ఇంటర్యూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ ఫోన్ సంభాషణలో రానాకి ‘ఘాటి‘ చిత్రం గురించి పలు ఆసక్తికర విశేషాలు వెల్లడించింది అనుష్క. ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌లో ఘాట్స్ ప్రాంతం నేపథ్యం కథతో ఈ సినిమా తెరకెక్కిందని అనుష్క తెలిపింది. ‘ఇది పెద్ద స్టోరీ కాదు కానీ, ఒక సాధారణ బాధితురాలు ఎలా క్రిమినల్‌గా మారుతుంది అన్నదే ‘ఘాటీ‘ అని.. ఇందులోని దేశిరాజు, శీలావతి పాత్రలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి‘ అని అనుష్క చెప్పింది.
తన కెరీర్‌లో ‘వేదం‘ సినిమాలో సరోజ పాత్ర ఎంతో ప్రాధాన్యం కలిగిందని, ఇప్పుడు ‘ఘాటీ‘ సినిమాలోని శీలావతి పాత్ర కూడా అలాంటి గుర్తింపునే ఇస్తుందని అనుష్క కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఇక ‘క్రిష్ ఎప్పుడూ నాకు ప్రత్యేకమైన పాత్రలే ఇస్తారు. చాలా సెన్సిటివ్ టాపిక్స్‌ను ఆయన బాగా చూపిస్తారు. ‘ఘాటీ‘ కూడా అలాంటి ప్రాజెక్ట్‘ అని అనుష్క చెప్పింది. ఇటీవలి సంవత్సరాల్లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేసిన అనుష్క, ఇక నుంచి వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చింది.
మొత్తంగా.. రానాతో అనుష్క ఈ కాల్ మొత్తం సరదాగా సాగింది. ఈ ఫోన్ సంభాషణలో అనుష్క పెళ్లి విషయం గురించి అడిగాడు రానా. అయితే.. ఆ సమయం వస్తే తానే చెబుతానంటూ మాట దాటేసింది స్వీటీ.
-
Home
-
Menu