‘పుష్ప 3’పై సుకుమార్ క్లారిటీ

‘పుష్ప 3’పై సుకుమార్ క్లారిటీ
X
దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ 2025 వేడుక పుష్ప అభిమానులకు మరిచిపోలేని క్షణాలను అందించింది. ఈ వేడుకల్లో ఐదు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది ‘పుష్ప 2’ చిత్రం.

దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ 2025 వేడుక పుష్ప అభిమానులకు మరిచిపోలేని క్షణాలను అందించింది. ఈ వేడుకల్లో ఐదు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది ‘పుష్ప 2’ చిత్రం. అయితే.. ఈ వేదికపై దర్శకుడు సుకుమార్ ఇచ్చిన ప్రకటన మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఉత్తమ దర్శకుడి అవార్డును స్వీకరించిన తర్వాత సుకుమార్ మాట్లాడుతూ – 'పుష్ప 3 కచ్చితంగా ఉంటుంది' అని స్పష్టతనిచ్చాడు. ఈ ఒక్క మాటతోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇప్పటికే ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ పేరుతో పోస్టర్ బయటకు వచ్చినా, ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో అసలు 'పుష్ప' సిరీస్ లో థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఉంటుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే సైమా వేదికపై దర్శకుడు ఇచ్చిన హామీతో ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది.

ఇప్పటికే ఈ సిరీస్ లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్’ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త కలెక్షన్ల రికార్డులు సృష్టించాయి. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు సుకుమార్.. రామ్ చరణ్ సినిమాకోసం స్క్రిప్ట్‌ సిద్ధం చేశాడు. ఇలా.. వీరిద్దరి ప్రయర్ కమిట్‌మెంట్స్ పూర్తైన తర్వాత 'పుష్ప 3' పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Tags

Next Story