SSMB29 గ్లింప్స్ రాబోతుంది?

SSMB29 గ్లింప్స్ రాబోతుంది?
X
‘బాహుబలి‘ సిరీస్ తో భారతీయ చిత్ర పరిశ్రమ దశ, దిశను మార్చిన దర్శకుడు రాజమౌళి. ఆ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్‘తో గ్లోబల్ లెవెల్ లో అవార్డుల పంట పండించాడు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో SSMB29ని తెరకెక్కిస్తున్నాడు.

‘బాహుబలి‘ సిరీస్ తో భారతీయ చిత్ర పరిశ్రమ దశ, దిశను మార్చిన దర్శకుడు రాజమౌళి. ఆ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్‘తో గ్లోబల్ లెవెల్ లో అవార్డుల పంట పండించాడు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో SSMB29ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మహేష్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవబోతోంది.

ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకుని, షూటింగ్ సైతం మొదలు పెట్టుకున్న SSMB29కి సంబంధించి ఎలాంటి అధికారిక పోస్టర్లు రాలేదు. జక్కన్న గత చిత్రాల తరహాలో కాకుండా ఈ సినిమాకోసం విభిన్నమైన స్ట్రాటజీని అవలంభిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో SSMB29 గురించి ఓ క్రేజీ బజ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయాలనుకుంటున్నారనేదే ఆ న్యూస్. ఇది కేవలం టైటిల్ రివీల్ వీడియో మాత్రమే కాకుండా.. సినిమా కాన్సెప్ట్ ను తెలియజేసేలా గ్లింప్స్ చాలా గ్రాండ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ గ్లింప్స్ ద్వారా మహేష్ బాబు పాత్రపై ఓ స్పష్టమైన అవగాహన రావొచ్చు. అలాగే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్స్ పైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తుండగా.. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Tags

Next Story