సెప్టెంబర్లో సెట్స్ పైకి 'స్పిరిట్'

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్‌ను ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'కింగ్డమ్' ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో సందీప్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయ్, 'స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుంది?' అని అడగ్గా, 'సెప్టెంబర్ చివర్లో సెట్స్‌పైకి వెళ్లబోతున్నాం, అటు నుంచి నాన్‌స్టాప్ షూటింగ్ కొనసాగుతుంది' అంటూ స్పష్టత ఇచ్చాడు.
ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇది ఆయన కెరీర్‌లో 25వ సినిమా కావడం విశేషం. మొదట దీపికా కథానాయికగా ప్రచారంలోకి వచ్చినా, ప్రస్తుతం తృప్తి డిమ్రి హీరోయిన్‌గా ఖరారైంది. ‘స్పిరిట్’ను భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ చిత్రంతో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ ప్రాజెక్ట్ అనంతరం 'స్పిరిట్'కు డేట్‌లు కేటాయించనున్నాడు. సందీప్ వంగా లాంటి మాస్ డైరెక్టర్ చేతిలో ప్రభాస్ పోలీస్ అవతారం ఎంత అగ్రెసివ్‌గా ఉండబోతుందోనని అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
-
Home
-
Menu