స్పార్క్ ఆఫ్ 'ది ప్యారడైజ్'

నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ చిత్రంలోని నాని పోషిస్తున్న జడల్ పాత్రకు సంబంధించి రెండు లుక్స్ రిలీజ్ చేసింది టీమ్. ఫస్ట్ లుక్ లో సాప్ట్‌గా కనిపిస్తున్న నాని.. సెకండ్ లుక్ లో రచ్చ లేపాడు. ఇప్పుడు ఆ రచ్చకు సంబంధించిన మేకింగ్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్.
ఒక జైలు బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ సన్నివేశం థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. జైలులో నాని డిప్స్ కొట్టడం, చుట్టూరా ఖైదీలు, జడలను ముట్టుకుంటే వాడికి సర్రుమంటుది అని చెప్పే డైలాగ్ ఈ మేకింగ్ వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా 'దసరా'కు మించి ఎంతో రస్టిక్ గా ఈ చిత్రంలోని నాని క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఎస్.ఎల్.వి. సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కు రెడీ అవుతుంది.
-
Home
-
Menu