ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌లో శ్రుతి?

ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌లో శ్రుతి?
X
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ యాక్షన్ మాస్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం చుట్టూ ఇప్పుడు భారీ హైప్ నెలకొంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ యాక్షన్ మాస్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం చుట్టూ ఇప్పుడు భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా టైటిల్‌గా ‘డ్రాగన్’ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం మంగళూరులో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అక్కడ పోర్ట్ బ్యాక్‌డ్రాప్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్.

ఈ షెడ్యూల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఫైనలైజ్ అయ్యిందనే ప్రచారం ఉంది. కానీ.. ఇప్పటివరకూ టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఈ మూవీలో శ్రుతి హాసన్ కూడా భాగస్వామ్యమవ్వబోతుందట.

ఇప్పటికే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్'లో శ్రుతి హీరోయిన్ గా నటించింది. అయితే.. ఎన్టీఆర్ మూవీలో శ్రుతి కేవలం స్పెషల్ నంబర్ వరకే పరిమితం కానుందట. 'కేజీఎఫ్'లో తమన్నా చేసిన ఐటెం సాంగ్ తరహాలో ఈ పాట ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

గతంలో 'ఆగడు' కోసం స్పెషల్ నంబర్ లో అదరగొట్టింది శ్రుతి. ఆ తర్వాత 'హాయ్ నాన్న'లోనూ ఆ తరహా పాటలో మురిపించింది. ఇక ఎన్టీఆర్ తో 'రామయ్య వస్తావయ్యా'లో హీరోయిన్ గా నటించింది. మొత్తంగా 'ఎన్టీఆర్-నీల్' మూవీలో శ్రుతి సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నట్టు తెలుస్తోంది.

Tags

Next Story