శివరాత్రి సందడి – కొత్త పోస్టర్లు, కొత్త అప్డేట్స్‌!

శివరాత్రి సందడి – కొత్త పోస్టర్లు, కొత్త అప్డేట్స్‌!

ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలతో పలు కొత్త సినిమాల నుంచి కొత్త పోస్టర్లు, కొత్త అప్డేట్స్ సందడి చేస్తున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్టీస్టారర్ ‘భైరవం‘ నుంచి పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ అగ్రెస్సివ్ లుక్స్ లో ఆకట్టుకుంటున్నారు.

నితిన్ ‘రాబిన్ హుడ్‘ చిత్రం మార్చి 28న రాబోతుంది. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుమల తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘రాబిన్ హుడ్‘ నుంచి మహాశివరాత్రి స్పెషల్ గా నితిన్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పోలీసాఫీసర్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు నితిన్.

తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది రచన చేస్తూ నిర్మించిన చిత్రం ‘ఓదెల 2‘. ఇప్పటికే విజయాన్ని సాధించిన ‘ఓదెల రైల్వే స్టేషన్‘కి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఇటీవల ప్రయాగ్ రాజ్ లో విడుదలైన ‘ఓదెల 2‘ టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈరోజు శివరాత్రి స్పెషల్ గా ఈ మూవీ నుంచి తమన్నా పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్.

కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ‘పెళ్లి కాని ప్రసాద్‘. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజవ్వగా.. ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలతో మరొక కొత్త పోస్టర్ విడుదల చేశారు. కట్నం వారి శాసనాల గ్రంథం అంటూ ఈ సినిమా కాన్సెప్ట్ ను తెలియజేసేలా ఒక పోస్టర్ విడుదల చేశారు.

నాగచైతన్య ‘తండేల్‘ ఫిబ్రవరి 7న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని శివుడి నేపథ్యంలో వచ్చే నమో నమ: శివాయ పాట ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈరోజు శివరాత్రి స్పెషల్ గా ఈ మూవీ ఫుల్ వీడియో సాంగ్ వస్తోంది.

Tags

Next Story