4K డాల్బీ అట్మాస్‌లో 'శివ'

4K డాల్బీ అట్మాస్‌లో శివ
X
తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టింగ్ మూవీ 'శివ'. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ఇది. అప్పటివరకూ ఓ మూసలో వెళుతున్న తెలుగు సినిమాని మరో కోణంలో ఆవిష్కరించిన చిత్రం 'శివ'.

తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టింగ్ మూవీ 'శివ'. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ఇది. అప్పటివరకూ ఓ మూసలో వెళుతున్న తెలుగు సినిమాని మరో కోణంలో ఆవిష్కరించిన చిత్రం 'శివ'. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ కి ఇది తొలి చిత్రమే. అయినా.. కథ, కథనాల పరంగానే కాకుండా సాంకేతికంగా 'శివ'ని ట్రెండ్ సెట్టింగ్ మూవీగా తీర్చిదిద్దాడు.

అక్కినేని నాగార్జున, అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మించారు. నాగార్జునకి జోడీగా ఆ తర్వాత ఆయనకు జీవిత భాగస్వామి అయిన అమల నటించింది. ప్రధాన ప్రతినాయకుడిగా రఘువరన్ నటించాడు. తనికెళ్ల భరణి ఈ సినిమాకి మాటలు సమకూరుస్తూనే.. ఓ పాత్రలోనూ అలరించారు.

'శివ' చిత్రం విజయంలో ఇళయరాజా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఎంతో కీలక భూమిక పోషించాయి. ఈ సినిమాలోని పాటలను వేటూరి, సిరివెన్నెల రాసారు. ఎస్.గోపాలరెడ్డి సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా మరో ప్లస్ పాయింట్. ఈ సినిమాని ఆ తర్వాత తమిళంలో 'ఉదయం' పేరుతో అనువదించారు. 1990లో హిందీలో ఈ చిత్రాన్ని మళ్లీ నాగార్జునతోనే రీమేక్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.

ఇక లేటెస్ట్ గా కల్ట్ క్లాసిక్ 'శివ' రీ-రిలీజ్‌కు రెడీ అవుతుంది. 4K డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయనున్నట్లు కింగ్ నాగార్జున తెలిపాడు. అన్నపూర్ణ స్టూడియోస్ 50ఏళ్ల జర్నీ సందర్భంగా అభిమానులకు ఇచ్చే ప్రత్యేక గిఫ్ట్ 'శివ' రీ రిలీజ్ అని పేర్కొన్నాడు కింగ్. రీ-రిలీజ్ ట్రైలర్‌ను ‘కూలీ’ సినిమాతో పాటు ప్రదర్శించనున్నారు. ఇక 'కూలీ'లో సైమన్ గా విలన్ రోల్ లో మురిపించబోతున్నాడు నాగ్. మొత్తంగా 'కూలీ'తో పాటుగా 'శివ' రీ రిలీజ్ ట్రైలర్ వస్తుండటంతో అక్కినేని ఫ్యాన్స్ కు థియేటర్లలో డబుల్ ట్రీట్ ఖాయం.



Tags

Next Story