‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెంకటేష్ ఆనందభరిత వ్యాఖ్యలు!

‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెంకటేష్ ఆనందభరిత వ్యాఖ్యలు!
X

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోన్న నేపథ్యంలో చిత్రబృందం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ నిర్వహించింది.

సక్సెస్ మీట్‌లో వెంకటేష్ మాట్లాడుతూ ఈ చిత్ర విజయానికి సంతోషం వ్యక్తం చేశారు. 'ప్రతి ఫ్యామిలీ సినిమా చేసినప్పుడు ప్రేక్షకుల నవ్వులు, ఆనందం చూడడం నాకు అపూర్వమైన అనుభూతిని ఇస్తుంది' అని అన్నారు వెంకీ. అలాగే 'అనిల్ రావిపూడి దర్శకత్వంలో నా కెరీర్‌లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ సాధించడంపై గర్వంగా ఉంది' అని తెలిపారు.

Tags

Next Story