బికినీ లో సాయి పల్లవి.. ఫ్యాన్స్ కు షాక్!

బికినీ లో సాయి పల్లవి.. ఫ్యాన్స్ కు షాక్!
X
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సహజ సౌందర్యానికి పర్యాయపదంగా నిలిచింది సాయి పల్లవి. మేకప్ లేకుండా కూడా తెరపై మెరిసిపోతూ, సహజమైన పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది.

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సహజ సౌందర్యానికి పర్యాయపదంగా నిలిచింది సాయి పల్లవి. మేకప్ లేకుండా కూడా తెరపై మెరిసిపోతూ, సహజమైన పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది. సాధారణంగా గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యం ఇస్తూ, ఎలాంటి బోల్డ్ సీన్స్ చేయకుండా తనదైన శైలిలోనే ముందుకు సాగిన ఈ హీరోయిన్‌.. తాజాగా పూర్తిగా భిన్నమైన అవతారంలో దర్శనం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

తన చెల్లెలు పూజా కన్నన్‌తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ సముద్ర తీరంలో బికినీ ధరించి కనిపించిన సాయి పల్లవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'ఇంతవరకు సింపుల్‌గా కనిపించిన పల్లవి బికినీలో కనిపించిందా? అని కొందరు ఆశ్చర్యపోతుండగా, 'ఇవి ఫేక్ ఫోటోలు కావచ్చు' అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

మలయాళంలో 'ప్రేమమ్'తో పరిచయమైన సాయి పల్లవి, తెలుగులో 'ఫిదా'తో ఒక్కసారిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత ఎక్కువగా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లోనే నటిస్తూ వచ్చింది. గ్లామర్ ట్రాక్‌కు పూర్తిగా దూరంగా ఉండి కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అరుదైన నటి సాయి పల్లవి. అందుకే ఆమె బికినీ లుక్ ఇప్పుడు అంత పెద్ద చర్చనీయాంశమవుతోంది.

ఇక ప్రొఫెషనల్ ఫ్రంట్‌లో, ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ 'రామాయణ'లో సీత పాత్రలో నటిస్తోంది. ఇంకా.. హిందీలో, సౌత్ లో మరికొన్ని ప్రాజెక్ట్స్ లోనూ భాగస్వామ్యమయ్యింది.

Tags

Next Story