చారిత్రాత్మక పాత్రల్లో రిషబ్!

చారిత్రాత్మక పాత్రల్లో రిషబ్!
X
‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరో కమ్ డైరెక్టర్ రిషబ్‌ శెట్టి. ఇప్పుడు ఆ విజయాన్ని కొనసాగిస్తూ ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ను రూపొందిస్తున్నాడు.

‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరో కమ్ డైరెక్టర్ రిషబ్‌ శెట్టి. ఇప్పుడు ఆ విజయాన్ని కొనసాగిస్తూ ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో ట్రెండింగ్ లో దూసుకెళ్లింది. 'కాంతార అంటే సినిమా కాదు, అది మా చరిత్ర' అనే రిషబ్ వ్యాఖ్యలు ఈ వీడియోలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఇక.. రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1'తో పాటు.. వరుసగా పౌరాణిక, చారిత్రక చిత్రాలను లైన్లో పెట్టడం ఆసక్తికరంగా మారింది. 'కాంతార' తర్వాత 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' బయోపిక్ తో అలరించబోతున్నాడు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శివాజీ పాత్రలో రిషబ్ కనిపించనుండగా, ఇది 2027 జనవరిలో విడుదల కానుంది. శివాజీ జీవితాన్ని ప్రెజెంట్ జెనరేషన్ కు పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట.

'1770.. ఏక్‌ సంగ్రామ్' మూవీ. బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన ‘ఆనందమఠ్’ ఆధారంగా రూపొందే ఈ చిత్రంలో ఓ శక్తివంతమైన పాత్రలో రిషబ్ కనిపించనున్నాడట. ‘ఆకాశవాణి’ ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలు పాత్రలోనూ రిషబ్ కనిపించబోతున్నాడు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇలాంటి చారిత్రక కథాంశాలు తెరకెక్కించడంలో అశుతోష్ గోవారికర్ ది ప్రత్యేకమైన శైలి.

వీటన్నింటితో పాటు సూపర్ హిట్ మూవీ 'హనుమాన్'కి సీక్వెల్ గా రూపొందుతున్న 'జై హనుమాన్'లోనూ రిషబ్ నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై హనుమాన్’లో రిషబ్ హనుమంతుడి పాత్రలో కనువిందు చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతుంది. మొత్తంగా.. సోషల్ మూవీస్ పక్కన పెట్టి ఇప్పుడు రిషబ్ వరుసగా పీరియాడిక్ మూవీస్ తో అలరించబోతుండటం ఆసక్తికరంగా మారింది.

Tags

Next Story