'వీరమల్లు'పైనే రత్నం ఆశలు!

వీరమల్లుపైనే రత్నం ఆశలు!
X
మేకప్ మ్యాన్ గా కెరీర్ మొదలు పెట్టి నిర్మాతగా, దర్శకుడిగా దశాబ్దాల ప్రస్థానం ఎ.ఎమ్.రత్నం ది. ఒకప్పుడు దక్షిణాదిలోనే అగ్ర నిర్మాతగా వెలుగొందారు రత్నం. 'భారతీయుడు, ఒకే ఒక్కడు, ప్రేమికులరోజు, బాయ్స్' వంటి సినిమాలను అందించారు.

మేకప్ మ్యాన్ గా కెరీర్ మొదలు పెట్టి నిర్మాతగా, దర్శకుడిగా దశాబ్దాల ప్రస్థానం ఎ.ఎమ్.రత్నం ది. ఒకప్పుడు దక్షిణాదిలోనే అగ్ర నిర్మాతగా వెలుగొందారు రత్నం. 'భారతీయుడు, ఒకే ఒక్కడు, ప్రేమికులరోజు, బాయ్స్' వంటి సినిమాలను అందించారు.తమిళంలో అగ్ర కథానాయకులు విజయ్, అజిత్ లతో వరుస సినిమాలను నిర్మించారు.

తెలుగులో చిరంజీవితోనూ 'స్నేహంకోసం' వంటి చిత్రాలను రూపొందించిన ఘనత రత్నం సొంతం. ఇక పవన్ కళ్యాణ్ తో ఎ.ఎమ్.రత్నం అనుబంధం ఎంతో ప్రత్యకమైనది. 'ఖుషి, బంగారం' వంటి సినిమాలు ఈ కాంబినేషన్ లో వచ్చాయి. అయితే ఆ తర్వాత 'సత్యాగ్రాహి' అనే సినిమా ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు.

మళ్లీ చాన్నాళ్లకు పవన్-రత్నం కలయికలో 'హరిహర వీరమల్లు' రూపొందింది. ఈ సినిమా ప్రధానంగా 16వ శతాబ్దపు మొఘల్ కాలం నేపథ్యంలో తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ ఇందులో ఒక రాబిన్‌హుడ్ తరహా వీరుడిగా కనిపించనుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబుగా కనిపించబోతున్నాడు. నిధి అగర్వాల్ కథానాయిక. ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు.

క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' ప్రారంభమైంది. అయితే, కోవిడ్ ప్రభావం, ఇతర ప్రాజెక్టులు కారణంగా క్రిష్ ప్రాజెక్ట్‌కి దూరమయ్యారు. అప్పట్నుంచి దర్శకత్వ బాధ్యతలు రత్నం తనయుడు జ్యోతికృష్ణ చేపట్టారు. నాలుగేళ్లుగా చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 12న విడుదలకు ముస్తాబవుతుంది. 'హరిహర వీరమల్లు' సినిమా చాలా కాలంగా ఎదురు చూసిన కల అని నిర్మాత ఎ.ఎమ్.రత్నం స్వయంగా పేర్కొన్నారు.

Tags

Next Story