'రాజాసాబ్' ప్యాలెస్ సెట్ అదుర్స్!

రాజాసాబ్ ప్యాలెస్ సెట్ అదుర్స్!
X
ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ చిత్రం డిసెంబర్ లో విడుదలకు ముస్తాబవుతుంది.

ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ చిత్రం డిసెంబర్ లో విడుదలకు ముస్తాబవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఆద్యంతం హారర్ కామెడీ జానర్ లో ఓ హవేలీ ప్యాలెస్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతుంది. తాజాగా టీజర్ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌ అజీజ్‌నగర్‌లో నిర్మించిన హవేలీ ప్యాలెస్ ను మీడియా ప్రతినిధులకు చూపించింది చిత్రబృందం.

టాప్ ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఈ సెట్ ను వేశారు. 9 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సెట్ ఇండియాలోనే అతిపెద్ద ఇండోర్ హవేలీ సెట్. ఈ సెట్ ను మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా చూపించారు. తెలుగు మీడియాతో పాటు తమిళ, మలయాళ, హిందీ జర్నలిస్టులను ఆహ్వానించి సినిమా స్థాయిని పరిచయం చేశారు. ఈ సినిమాలోని మేజర్ పోర్షన్ ఈ సెట్ లో జరుగుతుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా కంప్లీట్ చేసుకుంటుంది. డిసెంబర్ 5న 'ది రాజా సాబ్' విడుదలకు ముస్తాబవుతుంది.

Tags

Next Story