పవన్ సినిమాలో రాశీ ఖన్నా!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇప్పటికే శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో రాశీ ఖన్నా సెకండ్ హీరోయిన్‌గా ఎంపికవడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ తో రాశీ ఖన్నా నటించడం ఇదే తొలిసారి.
తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్ తోనూ గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా ఇటీవల పెద్ద సినిమాల్లో కనిపించడం లేదు. దీంతో.. ఈ ప్రాజెక్ట్ పై రాశీ భారీ నమ్మకంతో ఉంది. హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్‌లో ఆమె షూటింగ్‌లో పాల్గొంటోంది.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' రూపొందుతుంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మొదట ఈ సినిమా 'తేరీ' రీమేక్‌గా ప్రచారం జరిగినా.. ఆ తరువాత పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ మార్చినట్లు సమాచారం.
మరోవైపు పవన్ కళ్యాణ్ ‘ఓజీ, హరిహర వీరమల్లు’ చిత్రాల షూటింగ్‌లు పూర్తి చేసి, ఇప్పుడు ఈ సినిమాకి డేట్స్ కేటాయించడంతో యూనిట్ స్పీడ్‌గా పనిచేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆడియన్స్ ముందుకు రానుంది.
-
Home
-
Menu