వేతనాలు పెంచడానికి ఇష్టపడని నిర్మాతలు

తెలుగు సినీ కార్మికుల వేతనాలు కనీసం 30 శాతం పెంచాలంటూ డిమాండ్ చేస్తూ 24 కార్మిక సంఘాలు షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య వేతనాలపై జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం దాదాపు అన్ని షూటింగ్స్ నిలిచిపోయాయి.
సినీ కార్మికుల బంద్ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల మండలి అత్యవసర భేటీ నిర్వహించింది. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, మైత్రీ రవి, శివలెంక కృష్ణ ప్రసాద్ తదితర ప్రముఖ నిర్మాతలు హాజరయ్యారు. అయితే వేతనాల పెంపుపై నిర్మాతలు తుది నిర్ణయం తీసుకోలేదు. సమ్మె విషయం లేబర్ కమిషన్ అండర్ లో ఉన్నప్పుడు ఎలా బంద్ అని ప్రకటిస్తారు అన్న దాని మీదే చర్చ జరిగిందంటున్న నిర్మాతలు. ఈరోజు సాయంత్రం లేబర్ కమీషనర్ ను కలవనున్న ఫిల్మ్ ఛాంబర్ మరియు ఫెడరేషన్ సభ్యులు.
ఫెడరేషన్ బంద్ ప్రభావంతో సినిమాల విడుదల తేదీల్లో మార్పులకూ అవకాశాలు ఉన్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ముంబయి కార్మికులతో జరుగుతుండటం హాట్ టాపిక్ అయింది. నిర్మాత ఎస్కేఎన్ ‘పేరుకే వినోద పరిశ్రమ.. అసలెంతో విషాదం‘ అంటూ స్పందించారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్ ‘సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కంటే కూడా వీరికి వేతనాలు ఎక్కువగా ఉన్నాయి‘ అన్నారు.
-
Home
-
Menu