'ఫౌజీ'పై ప్రదీప్ రంగనాథన్ లీక్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా డిఫరెండ్ జానర్స్ లో వస్తున్నాయి. ఈ లిస్టులో 'ఫౌజీ' ఒకటి. రెండో ప్రపంచ యుద్ధం నాటి కథతో పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. 'సీతారామం' వంటి సూపర్ హిట్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే ఈ చిత్రం 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్ పరంగా ఇది ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్‌పై ఆసక్తికరమైన లీక్ బయటకు వచ్చింది.
తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ తన కొత్త సినిమా 'డ్యూడ్' ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ, 'మైత్రీ మూవీ మేకర్స్ వారు నాకు ప్రభాస్ 'ఫౌజీ' మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చూపించారు. వారి డెడికేషన్, ప్యాషన్ చూసి నేను నిజంగా షాక్ అయ్యాను' అని చెప్పిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీంతో, ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ కన్ఫమ్ అనేది అఫీషియల్ గా బయటకు వచ్చేసింది.
'ఫౌజీ' అనే పదమే ఓ సాహసం, ఓ గౌరవం, ఓ త్యాగం గుర్తు చేస్తుంది కాబట్టి, ఈ టైటిల్ ప్రభాస్ స్టైల్‌కూ, హను రాఘవపూడి నేరేషన్ టేస్ట్‌కూ సరిపోయేలా ఉందన్న చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి నటిస్తుంది. కీలక పాత్రల్లో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి వారు కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్.
-
Home
-
Menu