సంక్రాంతికి ప్రభాస్ సర్‌ప్రైజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యాక్షన్, మాస్ సినిమాల నుంచి కొంత విరామం తీసుకుని, పూర్తిస్థాయి హారర్ కామెడీ ఫాంటసీ ఎంటర్‌టైనర్ లో ప్రభాస్ నటించడం ఈ సినిమాకు స్పెషల్ హైలైట్‌గా మారింది.
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ టీజీ విశ్వప్రసాద్ దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవల యూరప్ లో సాంగ్స్ షూట్ జరుగుతుండగా సెట్స్ ప్రభాస్ కు సంబంధించిన నుంచి కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఈ లుక్స్‌లో ప్రభాస్ స్టైలిష్ ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ మారుతి 'రాజా సాబ్' ప్రింట్ ఉన్న టీ-షర్ట్‌లో కనిపించిన ఫోటోలను టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది.
ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ వంటి ముగ్గురు గ్లామరస్ హీరోయిన్లు ప్రభాస్ సరసన నటిస్తున్నారు. సినిమాలో వారితో వచ్చే ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. మరోవైపు తమన్ అందిస్తున్న ట్యూన్స్ ఇప్పటికే బజ్ క్రియేట్ చేస్తున్నాయి. త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.
ఈ సినిమా OTT రైట్స్ కోసం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుందట. హిందీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.100 కోట్లకు పైగా ఆఫర్ చేసిందని, దక్షిణాది భాషల రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ తీసుకోవచ్చని టాక్. సంక్రాంతి కానుకగా జనవరి 9న 'ది రాజా సాబ్' థియేటర్లలోకి వస్తోంది.
-
Home
-
Menu