పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్

పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్
X
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 'హరిహర వీరమల్లు' సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులను వాడుకున్నారని ఆయన ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 'హరిహర వీరమల్లు' సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులను వాడుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు, కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. పిటిషనర్‌ లాయర్ బాల ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరగా, కోర్టు ప్రస్తుతం ఆ దశ రాలేదని స్పష్టం చేసింది. ప్రాథమిక విచారణ అనంతరం తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

డిప్యూటీ సీఎంగా ప్రజా సేవ పట్ల శ్రద్ధ చూపకుండా సినిమాల్లో నటించడం తప్పు. 'హరిహర వీరమల్లు' సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలకు అనుమతులు ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలని తన పిటిషనల్ లో విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అవినీతి నిరోధక శాఖ డీజీకి లేఖ రాశారు. అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags

Next Story