‘ఆంధ్ర కింగ్‘ నుంచి పెప్పీ నంబర్

‘ఆంధ్ర కింగ్‘ నుంచి పెప్పీ నంబర్
X
ఉస్తాద్ రామ్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఓ సూపర్ స్టార్ కి డై హార్డ్ ఫ్యాన్ కి మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమాని మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్నాడు.

ఉస్తాద్ రామ్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఓ సూపర్ స్టార్ కి డై హార్డ్ ఫ్యాన్ కి మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమాని మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ గా కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తుంటే.. ఫ్యాన్ క్యారెక్టర్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కనిపించబోతున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి తమిళ కంపోజర్స్ వివేక్-మెర్విన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలే‘ ఇన్ స్టెంట్ గా హిట్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘పప్పీ షేమ్‘ రిలీజయ్యింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ కోసం రామ్ గీత రచయితగా మారితే.. ఇప్పుడు ఈ ‘పప్పీ షేమ్‘ సాంగ్ ను అతనే స్వయంగా ఆలపించాడు. భాస్కరభట్ల రచనలో రామ్ పాడిన ఈ పాట ఎనర్జిటిక్ గా ఆకట్టుకుంటుంది. నవంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.



Tags

Next Story