పవన్ కీలక దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ రంగ అభివృద్ధి, ప్రేక్షకులకు మెరుగైన సేవలందించే దిశగా కీలక సూచనలు చేశారు. థియేటర్లలో టికెట్ ధరల నియంత్రణతో పాటు ఆహార, పానీయాల ధరలపై కూడా ప్రభుత్వ శాఖలు పర్యవేక్షణ జరపాలని ఆయన సూచించారు.
పవన్ కళ్యాణ్ ప్రకారం, కొత్త చిత్రాల విడుదల సందర్భంలో టికెట్ ధరలు పెంచాలని కోరితే, అది వ్యక్తిగతంగా కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వంను సంప్రదించాలి. ఇది తన సినిమాలకూ వర్తిస్తుందని పవన్ అన్నారు. ‘హరిహర వీరమల్లు‘ సినిమా టికెట్ ధరల విషయంలో కూడా అదే విధానాన్ని పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
థియేటర్లలో తినుబండారాలు, శీతల పానీయాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయన్న విమర్శలపై కూడా పవన్ స్పందించారు. వాటి ధరలు, నాణ్యతపై పర్యవేక్షణ జరిపి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. మల్టీఫ్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలో కొన్ని సంస్థలు గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిన నేపథ్యంలో విచారణ చేపట్టాలని సూచించారు.
సినిమా హాళ్ల బంద్ ప్రకటనల వెనక ఉన్న కుట్రలు, రాజకీయ లక్ష్యాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంగా.. అందులో జనసేన నాయకుల పాత్ర ఉన్నా విచారణ వెనుకాడకూడదని పవన్ అన్నారు. బెదిరింపులు, దుర్వినియోగాలు నివారించాలంటూ ఆయా సినీ సంఘాలకు సూచనలు చేయాలన్నారు.
అంతేగాక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానున్న సమగ్ర సినిమా అభివృద్ధి విధానంలో తెలుగు సినీ రంగ ప్రతినిధుల సూచనలను చేర్చాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 27, 2025
🔸 థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు
🔸 నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి
🔸 రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది
🔸 సినిమా హాళ్ల…
-
Home
-
Menu