అర్జున్ దాస్ కి పవన్ కృతఙ్ఞతలు

అర్జున్ దాస్ కి పవన్ కృతఙ్ఞతలు
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌కి తమిళ నటుడు అర్జున్ దాస్ గంభీరమైన వాయిస్‌ ఓవర్ అందించాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌కి తమిళ నటుడు అర్జున్ దాస్ గంభీరమైన వాయిస్‌ ఓవర్ అందించాడు. ఈ విషయాన్ని అర్జున్ దాస్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించగా, పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా స్పందించి కృతజ్ఞతలు తెలిపారు.

'పవన్ కల్యాణ్ సార్‌ తన సినిమా ట్రైలర్‌కు వాయిస్ ఇవ్వమని అడిగినప్పుడు, ఎలాంటి ప్రశ్నలు లేకుండా వెంటనే ఒప్పుకున్నాను. ఇది మీకోసం సార్,' అంటూ అర్జున్ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన పవన్, 'ప్రియమైన సోదరుడు అర్జున్ దాస్, నీకు నేను రుణపడి ఉంటాను. నా అభ్యర్థనను మన్నించినందుకు ధన్యవాదాలు. నీ గొంతులో మ్యాజిక్, మెలోడీ ఉన్నాయి,' అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

పవన్ కృతజ్ఞతలకు స్పందించిన అర్జున్ దాస్, 'ఈ మెసేజ్ నాకు ఎంతో విలువైనది. మీరు అరుదుగా సహాయం అడిగే వ్యక్తి అని నాకు తెలుసు. అటువంటి సందర్భంలో నన్ను ఎంపిక చేసినందుకు గర్వంగా ఉంది,' అంటూ పేర్కొన్నారు.

ఇక ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుంది. ఇప్పటికే ఫాస్టెస్ట్ 38 మిలియన్ వ్యూస్ సాధించిన ట్రైలర్స్ లో ఒకటిగా నిలిచింది. డైరెక్టర్ క్రిష్ మొదలుపెట్టిన ఈ చిత్రాన్ని తర్వాత జ్యోతికృష్ణ పూర్తి చేశాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాబీ డివోల్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.



Tags

Next Story