'వీరమల్లు' సెట్స్ లో పవన్!

వీరమల్లు సెట్స్ లో పవన్!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు' ఎంతో కాలంగా ఆలస్యం కావడంతో అభిమానుల్లో ఆసక్తి తగ్గిన మాట వాస్తవం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు' ఎంతో కాలంగా ఆలస్యం కావడంతో అభిమానుల్లో ఆసక్తి తగ్గిన మాట వాస్తవం. అయితే తాజా సమాచారం మేరకు ఈ చిత్రం ఒక కొలిక్కికి వచ్చేసినట్టే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ రోజు సినిమా షూటింగ్‌లో పాల్గొనగా, ఈ షెడ్యూల్ రెండు రోజుల పాటు కొనసాగనుంది. దీంతో ఆయనకు సంబంధించిన బ్యాలెన్స్ పార్ట్ పూర్తవుతుందట.

అలాగే త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. మిగతా సాంగ్స్ ను వరుసగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ట్రైలర్ తో పాటే 'హరి హర వీరమల్లు' కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా దర్శకుడు జ్యోతి కృష్ణ దీన్ని చాలా పక్కా ప్లాన్‌తో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.




Tags

Next Story