పవన్ ‘మహావతార్‘ చూడాలి.. అల్లు అరవింద్

యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహా‘ సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ. 79 కోట్లు వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉంది. కన్నడలో హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై అశ్విన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ పై అల్లు అర్జున్ విడుదల చేశారు.
‘మహావతార్ నరసింహ‘ ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘రొరింగ్ సక్సెస్ మీట్‘ను నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు అశ్విన్‌కుమార్, తనికెళ్ల భరణి, జొన్నవిత్తుల రామలింగేశ్వరారావు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి వారిలో, సన్నిహితుల్లోగానీ మా కుటుంబాల్లో గానీ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ కు తెలిసినంత మరెవరికీ తెలియదు. సనాతన ధర్మం గురించి పవన్ చెబుతుంటే అందరం ముగ్ధులం అయిపోతాం. వారు ఈ మహావతార్ నరసింహా సినిమా చూడాలని, ఈ సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నా‘ అని అన్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు‘తో పాటుగా ‘మహావతార్ నరసింహా‘ రిలీజయ్యింది. హరిహర బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా.. ‘మహావతార్‘ అద్భుతమైన విజయాన్ని సాధించింది.
-
Home
-
Menu