పవన్ కళ్యాణ్ 'ఓజీ' మేనియా

ప్రస్తుతం టాలీవుడ్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’ మేనియాలో మునిగిపోయింది. ప్రమోషన్లకు ముందే, యూఎస్ మార్కెట్‌లో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో ప్రారంభమైన ప్రీ-సేల్స్ రికార్డులు బద్దలు కొడుతుండగా, పవన్ అభిమానులు సెప్టెంబర్ 25 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సాధారణంగా దసరా పండుగ అంటే అగ్రహీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2: తాండవం’ వాయిదా పడడంతో, దసరా బరిలో పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఒక్కటే నిలవబోతోంది. దీంతో ఈ పండుగ పూర్తిగా 'ఓజీ' పండుగగా మారిపోనుంది.
ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 24 గంటల్లోనే 3,00,000 డాలర్ల మార్క్ దాటేశాయి. ఇప్పటివరకు 9 వేలకు పైగా టికెట్లు అమ్ముడవడం విశేషం. పవన్ కెరీర్‌లోనే ‘ఓజీ’ అమెరికాలో అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని చెబుతున్నారు.
‘సాహో’ డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అర్జున్ దాస్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన బలం.
మరోవైపు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ సిద్ధంగా ఉందట. 'ఓజీ' నుంచి సాలిడ్ యాక్షన్ టీజర్ ప్లాన్ చేస్తుండగా, మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి కూడా స్పెషల్ ట్రీట్ రానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
-
Home
-
Menu