మరోసారి గ్యాంగ్‌స్టర్ గా పవన్?

మరోసారి గ్యాంగ్‌స్టర్ గా పవన్?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో సినిమాని చాలాకాలం క్రితమే అనౌన్స్‌ చేశారు. ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో సినిమాని చాలాకాలం క్రితమే అనౌన్స్‌ చేశారు. ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. అయితే.. పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉండటం వలన సురేందర్ రెడ్డి మూవీ లేటవుతూ వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' పూర్తి చేయడంతో ఇప్పుడు సురేందర్ రెడ్డి సినిమాకు డేట్స్ కేటాయించబోతున్నాడన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక పవర్ స్టార్ లేటెస్ట్ హిట్ 'ఓజీ' తరహాలో సురేందర్ రెడ్డి చిత్రం కూడా గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

‘కిక్, రేసుగుర్రం' వంటి స్టైలిష్ ఎంటర్‌టైనర్స్ తీశాడు సురేందర్ రెడ్డి. తన సినిమాల్లో హీరోలను ఎంతో స్టైలిష్ గా ప్రెజెంట్ చేసే సురేందర్ రెడ్డి.. పవన్ తో సినిమా చేస్తే చూడాలని పవర్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మొత్తంగా.. ఇకపై రాజకీయాలతో పాటు సినిమాలను కూడా కంటిన్యూ చేస్తానని పవర్ స్టార్ చెప్పాడు. ఈనేపథ్యంలో సురేందర్ రెడ్డి సినిమా ఖచ్చితంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే.. ఈ మూవీ ప్రోగ్రెస్ గురించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

Tags

Next Story