మూడో భాగం.. ముందు ఎవరు?

భారతీయ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్‌కి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు భాగాలూ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మరింత ఘన విజయాన్ని సాధించడం ద్వారా సౌత్ మూవీస్ కి పాన్ ఇండియా లెవెల్ లో సరికొత్త మార్కెట్ సృష్టించినట్టయ్యింది.
అదే బాటలో ‘కె.జి.యఫ్’ సిరీస్ వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రాఖీ భాయ్ క్యారక్టర్‌తో యష్ క్రేజ్ ఇండియా మొత్తాన్ని కుదిపేసింది. ఆ వెంటనే వచ్చిన ‘పుష్ప’ రెండు భాగాలు కూడా యావత్ దేశ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ ‘తగ్గేదే లే‘ అన్న డైలాగ్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా మార్మోగుతుంది. ‘బాహుబలి, కె.జి.యఫ్, పుష్ప‘ సిరీస్ ల లిస్టులోకి లేటెస్ట్ గా చేరిన సిరీస్ ‘కాంతార‘. ‘కాంతార‘ ఫస్ట్ పార్ట్ కి దీటుగా ఇప్పుడు సెకండ్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.
ఇక ‘బాహుబలి, కె.జి.యఫ్, పుష్ప, కాంతార’ – ఈ సిరీస్ సినిమాలకు ఇప్పుడు కామన్ డిస్కషన్ ఒక్కటే. మూడో భాగం వస్తోందా? లేదా? అన్న ప్రశ్న. ‘బాహుబలి‘కి తప్ప ‘కె.జి.యఫ్, పుష్ప, కాంతార‘ మూడు సిరీస్ లకు థర్డ్ పార్ట్ ను అనౌన్స్ చేశారు. అయితే.. వీటిలో ఏ చిత్రం ముందుగా మూడో భాగాన్ని మొదలు పెట్టబోతుందన్నది చూడాలి.
-
Home
-
Menu