అది పవన్ కే సాధ్యమైంది!

అది పవన్ కే సాధ్యమైంది!
X
ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉపముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ బాధ్యతలు, మరోవైపు సినీ తారగా కోట్లాది అభిమానుల అంచనాలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పవన్ చూపించిన డెడికేషన్ నిజంగా ఆశ్చర్యమే.

ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉపముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ బాధ్యతలు, మరోవైపు సినీ తారగా కోట్లాది అభిమానుల అంచనాలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పవన్ చూపించిన డెడికేషన్ నిజంగా ఆశ్చర్యమే. పవన్ ఎన్నికల నిమిత్తం పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోయిన సమయంలోనే 'హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్' ప్రాజెక్టులు ఆయా దశల్లో నిలిచిపోయాయి.

ఇక రాజకీయ పనుల మధ్యలో సమయం కేటాయిస్తూ ఒక్కో సినిమా చిత్రీకరణను వరుసగా పూర్తి చేశాడు పవర్ స్టార్. మొదటగా మే నెలలో 'హరిహర వీరమల్లు' ముగించి, జులైలోనే విడుదల చేశారు. ఆ వెంటనే 'ఓజీ' సెట్లోకి వెళ్లి, కేవలం మూడు వారాల వ్యవధిలో తన భాగం పూర్తి చేశాడు. 'ఓజీ' ఈనెలలోనే ఆడియన్స్ ముందుకు వస్తోంది.

మరోవైపు లేటెస్ట్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' పనులను సైతం పూర్తి చేశాడు పవర్ స్టార్. లేటెస్ట్ గా 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి పవన్ పార్ట్ మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇలా.. కేవలం కొన్ని నెలల్లో మూడు సినిమాలను పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ పట్టుదలతోనే ఇది సాధ్యమైంది.

ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్లో కీలక హోదాలో ఉన్నా, మరోవైపు సినిమాల పట్ల అభిమానుల అంచనాలను నెరవేర్చడం పవన్ కే సాధ్యమైంది. మరి.. 'హరిహర వీరమల్లు' నిరాశపరిచినా.. ఇప్పుడు 'ఓజీ'తో పవర్ స్టార్ కి భారీ విజయం వరిస్తుందనే అంచనాలున్నాయి.

Tags

Next Story