‘ఒక్కడు‘ తిరిగొస్తున్నాడు!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ని స్టార్ గా నిలబెట్టిన చిత్రం 'ఒక్కడు'. చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా దుమ్మురేపిన ప్రిన్స్.. 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 'మురారి'తో నటుడిగా నిరూపించుకున్నాడు. అయితే.. మహేష్ కి అసలు సిసలు హిట్ ఇచ్చిన సినిమా మాత్రం 'ఒక్కడు' అనే చెప్పాలి.
జనవరి 15, 2003లో విడుదలైన ఈ సినిమా పెను సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలోని ఛార్మినార్ సెట్ కోసమే కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టారు. నిర్మాత ఎమ్.ఎస్.రాజు ఖర్చుకేమాత్రం వెనుకాడకుండా నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు గుణశేఖర్ సరైన న్యాయం చేశారు. సంగీత పరంగా మణిశర్మ అందించిన పాటలు 'ఒక్కడు' విజయంలో మరో కీలక పాత్ర పోషించాయి.
మహేష్ సరసన కథానాయికగా భూమిక, ప్రతినాయకుడిగా ప్రకాష్ రాజ్ నటన అత్యద్భుతం. ఈ సినిమా ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, హిందీ వంటి భాషల్లో రీమేక్ అయ్యింది.
ఇప్పుడు తెలుగు పరిశ్రమలో రీ-రిలీజ్ ట్రెండ్ ఊపందుకుంటున్న వేళ, ‘ఒక్కడు‘ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. ఏప్రిల్ 26న ఈ సినిమాను గ్రాండ్ లెవెల్ లో రీ రిలీజ్ చేయబోతున్నారు. లేటెస్ట్ గా అందుకు సంబంధించి రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ RTC క్రాస్ రోడ్ లోని సంధ్య, విశ్వనాథ్ థియేటర్లలో అప్పుడే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం విశేషం.
-
Home
-
Menu