‘ఓజీ’ ట్రైలర్.. పవన్ వింటేజ్ స్వాగ్!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ఒక్కో కంటెంట్ అంచనాలను సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచాయి. ఇక.. లేటెస్ట్ గా మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ వచ్చేసింది.
పవన్ కళ్యాణ్ ను ఆయన ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకుంటారో.. అలాంటి వింటేజ్ విజువల్స్ తో ‘ఓజీ‘ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. 80ల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ ఓజాస్ గంభీర పాత్రలో కనిపించబోతున్నాడు పవన్. పవర్ స్టార్ స్వాగ్, స్టైల్ ఈ ట్రైలర్ కే హైలైట్. తమన్ బ్యాక్ గ్రౌండ్ సౌండింగ్ ఈ ట్రైలర్ లోని విజువల్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది.
‘ఓజీ‘కి పవర్ ఫుల్ విలన్ గా ఓమీ క్యారెక్టర్ లో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ నటించాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మొత్తంగా.. ఇప్పటివరకూ ‘ఓజీ‘ స్టోరీపై ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ తో ఆ క్లారిటీ ఇచ్చేశారు.
-
Home
-
Menu