'ఓజీ' మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ!

ఓజీ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ!
X
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నా, కమిటైన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వెళ్తున్నాడు. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' విడుదల కాగా, ఇప్పుడు అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ'.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నా, కమిటైన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వెళ్తున్నాడు. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' విడుదల కాగా, ఇప్పుడు అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ'. సెప్టెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవన్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు.

లేటెస్ట్ గా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లు మొదలవుతున్నాయి. తమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్‌ను శింబు పాడటం విశేషం. పాట రిలీజుకి ముందు 'ఫుల్ సాంగ్ లీకైంది' అనే పేరుతో తమన్ చేసిన సరదా ప్రాంక్ కాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదే సమయంలో ఓ యాక్షన్ సీన్ రిహార్సల్ వీడియో కూడా లీక్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.

పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విడుదలకు ఇంకా నెలన్నర రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్లతో సోషల్ మీడియాను ఊపేసే పనిలో ఉన్నారు. పవన్ ఫ్యాన్స్‌లో జోష్ రెట్టింపు చేసేలా ఈ చిత్రం మరో రీ-ఎంట్రీగా నిలవనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

Tags

Next Story