ఎల్బీ స్టేడియంలో 'ఓజీ' ఫీవర్

ఎల్బీ స్టేడియంలో ఓజీ ఫీవర్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజీ’ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేశాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజీ’ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేశాయి. లేటెస్ట్ గా ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, మ్యూజికల్ కన్సర్ట్ మరింత హైప్‌ క్రియేట్ చేశాయి.

ఈవెంట్‌లో సంగీత దర్శకుడు తమన్ 'ఓజీ'పై తన స్టైల్లోనే రివ్యూ ఇచ్చేశాడు. వేదికపై మీసం మెలేసి – “ఇదే నా రివ్యూ” అంటూ సినిమాకు బ్లాక్‌బస్టర్ స్టాంప్ వేశాడు. తాను మాత్రమే కాదు, సినిమా చూసిన ప్రతీ పవన్ కళ్యాణ్ అభిమాని కూడా గర్వంగా మీసం మెలుస్తారని తమన్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పేశాడు.

ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సుజీత్ తనకు పెద్ద ఫ్యాన్ అని.. “జానీ సినిమా చూసిన తర్వాత ఒక నెల రోజుల పాటు హెడ్ బ్యాండ్ తీసేయకుండా వేసుకుని తిరిగాడు. ఆ పిచ్చే ఇంత పెద్ద దర్శకుడిని చేసింది” అని తెలిపాడు. సినిమా విషయంలో సుజీత్ విజన్, డెడికేషన్ నెక్స్ట్ లెవెల్ అని కొనియాడారు. “ఈ సినిమాలో ఇద్దరే స్టార్స్ – సుజీత్, తమన్. వీళ్లిద్దరూ పిచ్చి స్థాయిలో ఈ సినిమా కోసం పనిచేశారు” అని పవన్ అన్నాడు.




Tags

Next Story