‘ఓజీ’ వసూళ్ల దండయాత్ర

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే మాట వినిపిస్తోంది – ‘ఓజీ’. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అభిమానులే కాదు, సినీ ప్రముఖులు కూడా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఊహించని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
‘ఓజీ’ ఓవర్సీస్‌లో, ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌తోనే సంచలనం సృష్టించింది. కేవలం ఒక్క రాత్రిలోనే 3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.26 కోట్లు) వసూలు చేసి రికార్డు బుక్‌లో కొత్త అధ్యాయం లిఖించింది. ఏ తెలుగు స్టార్ హీరో సినిమా ప్రీమియర్స్‌తో ఇంత పెద్ద వసూళ్లు సాదించింది లేదు. ఓవర్సీస్ మార్కెట్ ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి ఐదు మిలియన్ డాలర్ల దాకా దూసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ‘ఓజీ’ ప్రీమియర్స్ మరొక ప్రత్యేకం. ఒక్క నైజాం ఏరియాలోనే 366 ప్రీమియర్ షోలు వేశారు. కేవలం పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే భారత్‌లోనే సుమారు రూ.22.63 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇది ఇప్పటివరకు ఇండియాలోనే అతిపెద్ద ప్రీమియర్ డే కలెక్షన్‌గా నిలిచింది. మొత్తంగా.. 'ఓజీ' చిత్రం ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 150 కోట్లు గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కలెక్షన్ల గురించి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.
The ARRIVAL of the OG of Box Office 🔥#OG #TheyCallHimOG #BoxOfficeDestructorOG pic.twitter.com/dLCG3xZoeb
— DVV Entertainment (@DVVMovies) September 25, 2025
-
Home
-
Menu