నువ్వే కావాలి @ 25

నువ్వే కావాలి @ 25
X
అక్టోబర్‌ 13, 2000.. ఈ తేదీ తెలుగు సినిమా చరిత్రలో ప్రేమకథల రూపురేఖలు మార్చిన రోజుగా నిలిచిపోయింది. ఉషాకిరణ్ మూవీస్‌ బ్యానర్ పై రామోజీరావు, స్రవంతి రవికిశోర్ సంయుక్తంగా నిర్మించిన ‘నువ్వే కావాలి’ అప్పటి యువతరాన్ని మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించి ఘన విజయాన్ని సాధించింది.

తరుణ్‌ హీరోగా, రిచా హీరోయిన్‌గా, కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మలయాళ హిట్ ‘నిరం’కు రీమేక్‌. రూ.1.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.24 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన ఈ చిత్రం 20కి పైగా సెంటర్స్‌లో 200 రోజులు, కొన్ని చోట్ల 400 రోజులపాటు ప్రదర్శించబడింది. ఆ రోజుల్లో ఇది ఒక అద్భుతం!

ప్రేమను సహజంగా, నిజాయితీగా చూపించిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సంభాషణలు, కోటి మధురమైన సంగీతం, సీతారామశాస్త్రి–భువనచంద్రల సాహిత్యం, శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌, హరి అనుమోలు ఛాయాగ్రహణం.. ఇలా టెక్నికల్ గా ప్రతి విభాగం ఈ సినిమాకు ఆత్మగా నిలిచింది.

‘నువ్వే కావాలి’ చిత్రానికి జాతీయ స్థాయిలో ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా అవార్డు లభించింది. ఉత్తమ నటుడిగా తరుణ్, ఉత్తమ కథానాయికగా రిచా, ఉత్తమ దర్శకుడిగా విజయ్ భాస్కర్, ఉత్తమ రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఉత్తమ సంగీత దర్శకుడిగా కోటి, ఉత్తమ నిర్మాతగా ఉషాకిరణ్ మూవీస్ నంది అవార్డులు అందుకున్నారు.

Tags

Next Story