ఎన్టీఆర్ vs హృతిక్.. హ్యాష్‌ట్యాగ్ వార్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్ 2'. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ హిందీ సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆగస్టు 14న 'వార్ 2' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు సాలిడ్ రెస్పాన్స్ లభించింది. సినిమా యాక్షన్ గ్రాండియర్, ఎమోషన్, విజువల్స్ అన్నీ హై స్టాండర్డ్స్‌లో ఉండబోతున్నాయన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. ఇక ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు చిత్రబృందం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 10న విజయవాడలో నిర్వహించనుంది.
ప్రమోషన్ భాగంగా ఎన్టీఆర్, హృతిక్ మధ్య ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్ వార్ మొదలైంది. హృతిక్ “#HrithikvsNTR” హ్యాష్‌ట్యాగ్‌ను ప్రొపోజ్ చేస్తే.. ఎన్టీఆర్ “#NTRvsHrithik” అనే ట్యాగ్ కావాలంటూ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరూ సరదాగా ట్వీట్లు షేర్ చేస్తూ, ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచారు. వీరి ట్వీట్స్ యుద్ధం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంతేకాదు, ఓ ఇంటర్వ్యూలో హృతిక్ మాట్లాడుతూ, 'రిహార్సల్స్ అవసరం లేని హీరో ఎన్టీఆర్ మాత్రమే. అతని నుంచి ఎన్నో నేర్చుకున్నాను' అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది.
Admit it @iHrithik sir, #NTRvsHrithik just has a better ring to it. Let’s call it a win for me already! 😎 #War2 https://t.co/HcyDZw5354
— Jr NTR (@tarak9999) August 4, 2025
-
Home
-
Menu