‘ఎన్టీఆర్-నీల్‘ గ్లింప్స్ వాయిదా!

‘ఎన్టీఆర్-నీల్‘ గ్లింప్స్ వాయిదా!
X
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20)ను పురస్కరించుకొని, అభిమానులు బిగ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా ‘వార్ 2’ టీజర్ మే 20న విడుదలవుతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20)ను పురస్కరించుకొని, అభిమానులు బిగ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా ‘వార్ 2’ టీజర్ మే 20న విడుదలవుతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. దీంతో పాటు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ చిత్రం నుంచి గ్లింప్స్ రానుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అయితే తాజాగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, తమ ‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ మాస్ మిస్సైల్ గ్లింప్స్‌ను వాయిదా వేసినట్టు స్పష్టం చేశారు. అభిమానుల ఉత్సాహాన్ని గౌరవిస్తున్నామని, అయితే ‘వార్ 2’ టీజర్‌కు పూర్తి స్పాట్‌లైట్ ఇచ్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

మొత్తంగా మే 20న ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా వస్తోందనుకున్న ‘ఎన్టీఆర్-నీల్‘ గ్లింప్స్ రానట్టే. మరోవైపు బాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ ‘వార్ 2‘పై తారక్ ఫ్యాన్స్ స్పెషల్ ఫోకస్ ఉండబోతుంది. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ వంటి ఇండియన్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సూపర్ స్టార్స్ నటిస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్ లో ‘వార్ 2‘పై ఆసక్తి భారీ స్థాయిలో ఉంది. మరి.. ‘వార్ 2‘ ట్రీట్ ఏ లెవెల్ లో ఉంటుందో చూడాలి.



Tags

Next Story