బీస్ట్ మోడ్‌లో ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన ‘డ్రాగన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అభిమానులే కాదు, మొత్తం ఇండస్ట్రీనే కన్నేసి ఉంది.
ఈ సినిమాకోసం ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఎన్టీఆర్ స్లిమ్ & లీన్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ జిమ్‌లో చెమటోడుస్తూ, సిక్స్ ప్యాక్ యాబ్స్‌తో బీస్ట్ మోడ్‌లో చేసిన వర్కౌట్స్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘కేజీఎఫ్, సలార్’తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లను అందించిన ప్రశాంత్ నీల్ ఈసారి ఎన్టీఆర్‌తో కలిసి మరింత భారీ స్థాయిలో సినిమాను మలుస్తున్నాడు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ‘డ్రాగన్’ స్టోరీ, విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ లార్జర్ దాన్ లైఫ్ అనుభూతిని అందించబోతున్నాయి.
ఈ మూవీలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. ఇది నిజమైతే, ఎన్టీఆర్–రిషబ్ కాంబో స్క్రీన్ మీద మాస్ ఎక్స్‌ప్లోషన్ సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ‘డ్రాగన్’ను వచ్చే ఏడాది జూన్ 25 వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ కి జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
Every drop of sweat is building up for the destruction 💥💥
— Vamsi Kaka (@vamsikaka) September 16, 2025
Man of Masses @tarak9999 pushing limits for the hysteria of #NTRNeel 🔥🔥#NTR pic.twitter.com/1Tr55smIj2
-
Home
-
Menu