ఎన్టీఆర్ కి జోడీ కుదిరింది

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘డ్రాగన్‘పై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ కోసం టీమ్ రెడీ అవుతుంది.
ఇప్పటివరకు ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్ ఎవరు? అన్న ప్రశ్నపై సస్పెన్స్ కొనసాగింది. అయితే.. లేటెస్ట్ గా ‘మదరాసి‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఈవెంట్ లో రుక్మిణి చేయబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ గురించి ఎన్వీ ప్రసాద్ తెలిపారు. వీటిలో ‘కాంతార.. చాప్టర్ 1, టాక్సిక్‘ వంటి చిత్రాలతో పాటు ఎన్టీఆర్ ‘డ్రాగన్‘ కూడా ఉందని ఆయన అన్నారు.
‘కేజీయఫ్, సలార్’ వంటి మాస్ బ్లాక్‌బస్టర్లతో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ‘డ్రాగన్‘ కోసం ఎన్టీఆర్ ను నెవర్ బిఫోర్ గా ఆవిష్కరించబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ జూన్ 25, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
Home
-
Menu