‘కాంతార‘ ప్రీ రిలీజ్ కు ఎన్టీఆర్

‘కాంతార‘ ప్రీ రిలీజ్ కు ఎన్టీఆర్
X
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ కమ్ యాక్టర్ రిషబ్ శెట్టి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. ఎన్టీఆర్ తల్లి షాలిని.. రిషబ్ శెట్టి సొంత ప్రాంతానికి చెందిన వారు కావడం కూడా వీరిద్దరి మధ్య అనుబంధానికి ప్రధాన కారణం.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ కమ్ యాక్టర్ రిషబ్ శెట్టి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. ఎన్టీఆర్ తల్లి షాలిని.. రిషబ్ శెట్టి సొంత ప్రాంతానికి చెందిన వారు కావడం కూడా వీరిద్దరి మధ్య అనుబంధానికి ప్రధాన కారణం. ఇక.. దసరా కానుకగా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది మోస్ట్ అవైటింగ్ ‘కాంతార.. చాప్టర్ 1‘. ఈ సినిమా విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారంలో స్పీడు పెంచారు మేకర్స్.

సూపర్ హిట్ ‘కాంతార‘కి ప్రీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీపై తెలుగు రాష్ట్రాలలోనూ భారీ క్రేజుంది. ఈనేపథ్యంలో.. సెప్టెంబర్ 28న హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ విచ్చేస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో రిషబ్ కి జోడీగా రుక్మిణి వసంత్ నటించింది. మొత్తంగా.. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ సీక్వెల్ గా రాబోతున్న ‘కాంతార చాప్టర్ 1‘ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



Tags

Next Story