యుద్ధ ట్యాంకులతో ఎన్టీఆర్ ఫ్యాన్స్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్‌కు తాజా ఉదాహరణగా యూకేలో జరిగిన ప్రత్యేక ర్యాలీ నిలిచింది. 'టైగర్ నేషన్ UK' అనే అభిమాన సంఘం, ‘వార్ 2’ సినిమా ప్రచారంలో భాగంగా రెండో ప్రపంచ యుద్ధం నాటి అసలైన యుద్ధ ట్యాంకులతో గ్రాండ్ ర్యాలీ నిర్వహించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జెండాలు, నినాదాలతో సందడి చేసిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమం ఎన్టీఆర్‌కి ఉన్న అంతర్జాతీయ ఫ్యాన్ బేస్‌కు నిదర్శనమని నిర్వాహకులు చెబుతున్నారు.మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్‌కు తాజా ఉదాహరణగా యూకేలో జరిగిన ప్రత్యేక ర్యాలీ నిలిచింది. 'టైగర్ నేషన్ UK' అనే అభిమాన సంఘం, ‘వార్ 2’ సినిమా ప్రచారంలో భాగంగా రెండో ప్రపంచ యుద్ధం నాటి అసలైన యుద్ధ ట్యాంకులతో గ్రాండ్ ర్యాలీ నిర్వహించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్‌కు తాజా ఉదాహరణగా యూకేలో జరిగిన ప్రత్యేక ర్యాలీ నిలిచింది. 'టైగర్ నేషన్ UK' అనే అభిమాన సంఘం, ‘వార్ 2’ సినిమా ప్రచారంలో భాగంగా రెండో ప్రపంచ యుద్ధం నాటి అసలైన యుద్ధ ట్యాంకులతో గ్రాండ్ ర్యాలీ నిర్వహించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
'వార్ 2'లో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ హీరోగా నటించడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-సేల్స్ ఇప్పటికే సరికొత్త రికార్డులు సృష్టించాయి. నార్త్ అమెరికాలో కేవలం 7 గంటల్లోనే $100K ప్రీ సేల్స్‌ను దాటిన తొలి భారతీయ చిత్రంగా 'వార్ 2' నిలిచింది. ఇదే రికార్డును ఎన్టీఆర్ నటించిన 'దేవర' 11 గంటల్లో సాధించగా, ఇప్పుడు ఎన్టీఆర్ తన రికార్డును తానే బ్రేక్ చేసినట్టు అయింది.
'వార్ 2' తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ రూ.80 కోట్లకు కొనుగోలు చేయగా, రజనీకాంత్ నటించిన 'కూలి' హక్కులను ఏషియన్ సురేష్ రూ.42 కోట్లకు సొంతం చేసుకున్నారు. రెండు సినిమాలూ ఆగస్టు 14న విడుదల కానున్నాయి.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘వార్ 2’ నుంచి ఇప్పటికే వచ్చిన ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. ఇటీవల విడుదలైన ‘ఊపిరి ఊయలలాగా’ పాట ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ సినిమా నిడివి 3 గంటల 5 నిమిషాలు ఉంటుందని సమాచారం. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో 'వార్ 2' భారీ ఎత్తున రిలీజ్ రిలీజ్ కాబోతుంది.
When TIGER NATION Moves, Even The IMPOSSIBLE Bows Down !🙇♂️
— UK NTR Fans (@UKNTRfans) August 1, 2025
A RALLY Like No Other, History Rolled With Us With REAL TANKS That Fought In #WorldWAR2 Now Roars For TIGER NATION On REAL BATTLEFIELD 🐯
LOVE YOU FOREVER @tarak9999 ❤️🔥#WAR2 #WAR2Celebrations @yrf
VC: @Movies_NTR 🔥 pic.twitter.com/BIl0vDW9gp
-
Home
-
Menu