నీల్ సెట్స్ లోకి ఎన్టీఆర్!

నీల్ సెట్స్ లోకి ఎన్టీఆర్!
X
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్స్ లిస్టులో ప్రశాంత్ నీల్ సినిమాని ప్రథమంగా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ లోని మాస్ పవర్ ను ఓ రేంజులో ఆవిష్కరించే చిత్రంగా ఈ సినిమాపై భారీ క్రేజుంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్స్ లిస్టులో ప్రశాంత్ నీల్ సినిమాని ప్రథమంగా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ లోని మాస్ పవర్ ను ఓ రేంజులో ఆవిష్కరించే చిత్రంగా ఈ సినిమాపై భారీ క్రేజుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ నీల్‘ మూవీ ఇప్పటికే పట్టాలెక్కింది. అయితే తారక్ లేకుండానే షూటింగ్ జరుపుకుంటుంది. లేటెస్ట్ గా ఎన్టీఆర్ కూడా నీల్ సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఏప్రియల్ 22 నుంచి ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నాడు తారక్.

‘కె.జి.యఫ్‘ సిరీస్, ‘సలార్‘ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో సంచలన విజయాలు సాధించాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఆ సినిమాలకు మించిన రీతిలో ఎన్టీఆర్ చిత్రం రూపొందుతుంది. ప్రశాంత్ నీల్ రగ్గడ్ మాస్ ను చూపించడంలో మాస్టర్. ఎన్టీఆర్‌కి మాస్, క్లాస్, యాక్షన్ అన్నీ బ్యాలెన్స్ చేయగల టాలెంట్ ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఓ డార్క్, ఇంటెన్స్, ఎమోషనల్ యాక్షన్ సాగాగా ఈ చిత్రం రూపొందుతుంది.

వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా రెడీ అవుతున్న ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతుందనే ప్రచారం ఉంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ రెగ్యులర్ టెక్నీషియన్స్ రవి బస్రూర్, భువన్ గౌడ పనిచేస్తున్నారు. తారక్ కి జోడీగా రుక్మిణి వసంత్ నటించనుందట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘డ్రాగన్‘ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

Tags

Next Story