ఎన్టీఆర్ హాజరైతే వేడుక వేరే లెవల్!

ఎన్టీఆర్ హాజరైతే వేడుక వేరే లెవల్!
X
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ప్రీ-రిలీజ్ ఈవెంట్ భారీగా జరిగింది. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ప్రీ-రిలీజ్ ఈవెంట్ భారీగా జరిగింది. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. విజయశాంతి గారు చేసిన 'కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు' వంటి చిత్రాల ప్రస్తావన చేస్తూ, ఆమెను భారత సినిమా చరిత్రలో అప్రతిహతమైన మహిళా నటిగా కొనియాడాడు. ఈ సినిమా ఆలోచన 'కర్తవ్యం' నుంచే స్ఫూర్తి పొందిందేమోనన్న భావనను కూడా షేర్ చేశాడు తారక్.

అంతేకాదు తన మనసుకు దగ్గరైన ఈ చిత్రాన్ని తానే ముందుగా చూసినట్లు వెల్లడించాడు. 'విజయశాంతి లేకపోతే ఈ సినిమా లేదని, చివరి 20 నిమిషాలు ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పిస్తాయంటూ' సినిమాపై తన నమ్మకాన్ని తెలియజేశాడు ఎన్టీఆర్.

వేదికపై ఎన్టీఆర్.. అన్న కళ్యాణ్ రామ్‌ను 'కాలర్ ఎగరేయమంటూ' ఉత్సాహపరిచిన సన్నివేశం అభిమానులకు మధురంగా మిగిలింది. కళ్యాణ్ రామ్ మొహమాటపడడంతో తానే స్వయంగా కాలర్ ఎగరేసి అందరినీ నవ్వించాడు. ఈ సందర్భంగా తారక్ తన తాజా చిత్రం 'వార్ 2' ఈ ఆగస్టు 14న విడుదలవుతుందని స్పష్టం చేశాడు.

Tags

Next Story