శశిరేఖగా నయనతార

శశిరేఖగా నయనతార
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. వచ్చే సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతోన్న ఈ సినిమా నుంచి దసరా స్పెషల్ గా ఓ మెగా అప్డేట్ రాబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. వచ్చే సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతోన్న ఈ సినిమా నుంచి దసరా స్పెషల్ గా ఓ మెగా అప్డేట్ రాబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే.. అంతకంటే ముందే ఈ మూవీ నుంచి హీరోయిన్ నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో నయనతార ‘శశిరేఖ’ పాత్రలో కనిపించబోతుంది. అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పసుపురంగు చీరలో గొడుగు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న నయనతార లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌ను పంచుకుంటూ.. ‘మన దసరా కానుక ఇదొక్కటే కాదు, రేపు మరో సర్‌ప్రైజ్ రెడీగా ఉంది‘ అని తెలపడంతో విజయదశమి రోజున ఏం కొత్త అప్‌డేట్ రాబోతోందోనన్న ఆసక్తి మెగా ఫ్యాన్స్ లో పెరిగింది.



Tags

Next Story