'పెద్ది'తో క్లాష్‌పై నాని స్పందన

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘హిట్-3’ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు 'హిట్ 3' కోసం ఓ రేంజులో ప్రమోట్ చేస్తున్న నాని.. తన తర్వాతి సినిమా 'ది ప్యారడైజ్' గురించి కూడా ఆసక్తికర విశేషాలు పంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా 'ది ప్యారడైజ్'కి రామ్ చరణ్ 'పెద్ది'తో బాక్సాఫీస్ క్లాష్ గురించి కూడా పెదవి విప్పాడు.
నాని ‘ది ప్యారడైజ్’ను 2026, మార్చి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే 'ది ప్యారడైజ్' వస్తోన్న ఒక్క రోజుకే రామ్ చరణ్ 'పెద్ది' థియేటర్లలోకి స్తోంది. అంటే 2026, మార్చి 27న 'పెద్ది' విడుదలవుతోంది. మార్చి 27న అంటే రామ్ చరణ్ పుట్టినరోజు కావడం కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసుకోవడానికి కారణం. దీంతో.. ఒక్కరోజు గ్యాప్ లో 'ది ప్యారడైజ్, పెద్ది' మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఖరారైంది.
ఈ విషయంపై నాని స్పందిస్తూ, 'సినిమాలు ఒకదానికొకటి పోటీ పడటం సహజం. అదే పోటీ ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహం తీసుకువస్తుంది' అన్నాడు. అలాగే ‘పెద్ది’ వంటి సినిమా నా చిత్రానికే కాదు, మొత్తం పరిశ్రమకే బలాన్నిస్తుంది' అని అన్నాడు. అయితే విడుదల తేదీలపై తాను తుది నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదని, ఆ బాధ్యత నిర్మాతలదేనని నాని స్పష్టం చేశాడు. రెండు చిత్రాలు సకాలంలో పూర్తై, ప్రకటించిన తేదీలకే వస్తాయా? లేదా పోటీ వాతావరణంలో మార్పులు జరిగేనా? అన్నది వేచి చూడాలి.
-
Home
-
Menu