హ్యాట్రిక్ కోసం సిద్దమైన నాగవంశీ!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న మల్టీస్టారర్ 'వార్ 2' బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోను భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడు. ఈ మూవీలో హృతిక్‌తో కలిసి డ్యాన్సుల్లోనూ, ఫైట్స్ లోనూ చెలరేగిపోనున్నాడు తారక్. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెలుగు రైట్స్ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ దక్కించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఎన్నో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడినప్పటికీ, చివరకు నాగవంశీ 'వార్ 2' తెలుగు హక్కులను పొందారు. ఎన్టీఆర్ తో ఇప్పటికే ‘అరవింద సమేత‘ చిత్రాన్ని నిర్మించి సూపర్ హిట్ అందుకున్న నాగవంశీ.. ఆ తర్వాత ‘దేవర‘ చిత్రాన్ని తానే సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ‘వార్ 2‘తో హ్యాట్రిక్ హిట్ అందుకునేందుకు సిద్ధమవుతున్నారు సితార అధినేత.
ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 14న ‘వార్ 2’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
Kicking off the GUNS BLAZING for a HATTRICK 👊🏾🔥
— Sithara Entertainments (@SitharaEnts) July 5, 2025
We are proud to join hands with Man of Masses @Tarak9999, Greek God @iHrithik and the powerhouse @yrf to bring this explosive ride called #WAR2 across the Telugu States ❤️🔥🔥
A festival of celebration awaits at theatres from this… pic.twitter.com/sFc0R2ZriK
-
Home
-
Menu