విలన్‌గా నాగార్జున కొత్త అవతారం!

విలన్‌గా నాగార్జున కొత్త అవతారం!
X
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మల్టీ స్టారర్‌ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మల్టీ స్టారర్‌ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.లేటెస్ట్ గా చెన్నైలో జరిగిన ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నటుడు నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుందని, తాను పోషించిన సైమన్ అనే పాత్ర పూర్తిగా విలన్ షేడ్స్‌తో ఉంటుందని నాగ్ తెలిపారు. గతంలో 1992లో 'అంతం' చిత్రంలో నెగటివ్ రోల్‌లో కనిపించిన నాగార్జున.. దాదాపు 33 ఏళ్ల తర్వాత మళ్లీ విలన్‌గా మాస్‌ను షాక్‌కు గురి చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో నాగ్ లుక్ స్టైలిష్ గా ఆకట్టుకుంటుంది.

'ఈ సినిమా చూస్తే వంద భాషా చిత్రాలు చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇది పూర్తిస్థాయి విజిల్ మూవీ,' అని నాగ్ వ్యాఖ్యానించారు. తన పాత్రను ఎలాంటి స్టైల్‌లో లోకేష్ తెరకెక్కించాడో చూసి తానే షాక్‌ అయ్యానని అన్నారు. శృతి హాసన్ కూడా సైమన్ పాత్ర గురించి మాట్లాడుతూ నాగ్ పెర్ఫార్మెన్స్ చూసి అందరూ ఫ్యాన్స్ అయిపోయారన్నారు.

Tags

Next Story