తండేల్ తో భారీ విజయం కైవసం చేసుకున్న నాగచైతన్య

శ్రీకాకుళం యాసతో అలానే మత్స్యకారులు పడే కష్టాలను అద్భుతంగా చిత్రీకరించి ప్రేక్షకులు మన్నన పొందిన చిత్రం తండేల్. అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుందని చెప్పాలి. అలానే నాగచైతన్య నటనకి కూడా వందకి వంద మార్కులు పడ్డాయి ఈ సినిమాతో. తండేలు ముందు వరకు నాగచైతన్య నటన ఒక రకంగా ఉంటే ఖండేల్ తరువాత మాత్రం తన నటనను ఇంప్రూవ్ చేసుకుని ప్రతి ఎమోషన్ ని కూడా అత్యద్భుతంగా చూపించారు. అక్కినేని ఫ్యామిలీకి సరైన హిట్టు పడలేదు అని ఇప్పటివరకు అభిమానులు అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు చందు ముండేటి దర్శకత్వంలో వచ్చిన తండాల సినిమాతో అక్కినేని అభిమానులకు పండుగ వాతావరణం లో మారింది. చైతు యాక్టింగ్ కి కూడా కచ్చితంగా నేషనల్ అవార్డు రావాలి అని కూడా అందరూ అనుకుంటున్నారు.
నటన నైపుణ్యతను చూపించి తనకు ఇచ్చిన పాత్రను న్యాయం చేసే విధంగా నటించారు చైతన్య. అలానే సాయి పల్లవి ఎంత అద్భుతంగా నటిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటిది సాయి పల్లవిని నాగచైతన్య ని చూసి నేను ఇంకా బాగా చేయాలి అని అనుకుంది అంటే నాగచైతన్య ఏ విధంగా తన పాత్రలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే అక్కినేని అభిమానులకు అలానే వారి కుటుంబ సభ్యులకు కూడా ఇదొక గొప్ప విజయం గా భావించవచ్చు. ఇక రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో కూడా చందు మొండేటి మాట్లాడుతూ చైతన్యలో ఒక గొప్ప నటుడు ఉన్నాడు అది ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు.
ఇంత గొప్ప నటుడుకి ఒక మంచి పాత్ర వస్తే ఎలా ఉంటుందో మళ్లీ చూపిస్తాను. అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన తెనాలి రామకృష్ణుడు పాత్రని, మరొకసారి హిస్టారికల్ గా నాగచైతన్యతో చిత్రీకరిస్తాం అని చెప్పారు. ఇక మరొకసారి చందు ముండేటి దర్శకత్వంలో నాగచైతన్య ఇంకొక మంచి పాత్ర పోషిస్తారు అని అర్థమవుతుంది.
అక్కినేని కుటుంబానికి చందు మండేటి వరుస విజయాలు ఇవ్వడానికి సిద్ధమైపోయారన్నమాట. ఏదైతేనేం ఇంతవరకు నాగచైతన్య కెరీర్ లోనే చూడనంత విజయాన్ని తండేలితో కైవసం చేసుకున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి.
-
Home
-
Menu