నాగార్జున 100వ చిత్రానికి ముహూర్తం!

నాగార్జున 100వ చిత్రానికి ముహూర్తం!
X
టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కెరీర్‌లో వందో చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు. వందో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతాయి.

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కెరీర్‌లో వందో చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు. వందో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అందుకే తన ప్రెస్టేజియస్ సెంచరీ మూవీని సమ్‌థింగ్ స్పెషల్ గా ప్లాన్ చేశాడు కింగ్.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లాంచింగ్ దసరా సందర్భంగా అట్టహాసంగా జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారట. అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొనవచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

తమిళ దర్శకుడు రా. కార్తీక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు ‘100 నాటౌట్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. నాగార్జున తన సొంత బ్యానర్‌లోనే ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Tags

Next Story