ఆగస్టు నెలలో సినిమాల సందడి

ఆగస్టు నెలలో సినిమాల సందడి
X
జూలై నెలలో ‘హరిహర వీరమల్లు, కింగ్డమ్‘ వంటి సినిమాలొచ్చాయి. వీటిలో ‘వీరమల్లు‘ బాక్సాఫీస్ వద్ద పెర్ఫామ్ చేయలేదు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ‘కింగ్డమ్‘కి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కుతుంది.

జూలై నెలలో ‘హరిహర వీరమల్లు, కింగ్డమ్‘ వంటి సినిమాలొచ్చాయి. వీటిలో ‘వీరమల్లు‘ బాక్సాఫీస్ వద్ద పెర్ఫామ్ చేయలేదు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ‘కింగ్డమ్‘కి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కుతుంది. ఇక జూలై ముగిసింది. ఈ ఆగస్టు నెల మొదటి రోజు నుంచే సినిమాల సందడి మొదలయ్యింది.

ఈ రోజు తెలుగు నుంచి పెద్దగా సినిమాలు లేకపోయినా.. అనువాద రూపంలో తమిళం నుంచి ‘సార్ మేడమ్‘ థియేటర్లలోకి వచ్చింది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన చిత్రమిది. ఈరోజే అజయ్ దేవగణ్ ‘సన్ ఆఫ్ సర్దార్ 2‘, సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ‘ధడక్ 2‘ రిలీజయ్యింది.

వచ్చే వారం మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా ‘అతడు‘ రీ రిలీజవుతుంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘అతడు‘ 20 ఏళ్ల క్రితం విడుదలై కల్ట్ స్టేటస్ పొందింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి సినిమాతో బిజీగా ఉండడంతో మరో రెండేళ్ల వరకూ థియేటర్లలో సందడి చేసే అవకాశం కనిపించడం లేదు. దీంతో.. ఆగస్టు 9న వచ్చే ‘అతడు‘ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఆగస్టు 14న అసలు సిసలు బాక్సాఫీస్ వార్ జరగబోతుంది. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ మల్టీస్టారర్ ‘వార్ 2‘ తో పాటు.. లోకేష్ కనకరాజ్ ‘కూలీ‘ ఆరోజు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో పోటీ పడబోతున్నాయి. తారక్ డెబ్యూ హిందీ సినిమా కావడంతో ‘వార్ 2‘పై సౌత్ లోనూ మంచి క్రేజుంది.

‘కూలీ‘ కూడా భారీ మల్టీస్టారర్. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో ‘కూలీ‘పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ ఆగస్టు నెలలోనే అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా‘, చిరంజీవి ‘స్టాలిన్‘ రీ రిలీజ్, నారా రోహిత్ ‘సుందరకాండ‘ వంటివి రాబోతున్నాయి.

Tags

Next Story