మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
X
సినిమా రంగంలో విశేష కృషి చేసిన వారికి భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవిస్తూ ఉంటుంది. 2023వ సంవత్సరానికి గానూ ఈ అవార్డుకు మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎంపికయ్యారు.

సినిమా రంగంలో విశేష కృషి చేసిన వారికి భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవిస్తూ ఉంటుంది. 2023వ సంవత్సరానికి గానూ ఈ అవార్డుకు మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎంపికయ్యారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

సినీ పరిశ్రమలో నాలుగున్నర దశాబ్దాలకు తనదైన ముద్ర వేసుకుంటూ, 350కి పైగా చిత్రాల్లో నటించిన ఘనత మోహన్ లాల్ సొంతం. 1980లో 'మంజిల్ విరింజా పూక్కల్' చిత్రంతో తెరంగేట్రం చేసిన మోహన్ లాల్.. ఇప్పటికీ కథానాయకుడిగా అగ్ర పథాన కొనసాగుతున్నారు. మలయాళంలోనే కాకుండా, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాలలోనూ నటించి తన ప్రతిభను నిరూపించుకున్నారు.

తెలుగు ప్రేక్షకులకు 'జనతా గ్యారేజ్' ద్వారా మరింత చేరువైన మోహన్ లాల్.. తన అనువాద చిత్రాలతో ఇక్కడా మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. ఇప్పటివరకూ అనేక జాతీయ అవార్డులు అందుకోవడంతో పాటు భారత ప్రభుత్వ పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు సైతం పొందారు మోహన్ లాల్. సెప్టెంబర్ 23న ఢిల్లీలో జరగబోయే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో మోహన్‌లాల్ ఈ అత్యున్నత గౌరవాన్ని స్వీకరించనున్నారు.



Tags

Next Story